rudraraj: ఏపీకి హోదా, హామీలపై సుప్రీంలో ‘కాంగ్రెస్’ పిటిషన్
- ఏపీకి హోదా, హామీలు అమలు చేయాలి
- ఈ మేరకు కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలి
- పిటిషన్ లో కోరిన గిడుగు రుద్రరాజు
ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నేత గిడుగు రుద్రరాజు సుప్రీంకోర్టులో ఈ రోజు పిటిషన్ దాఖలు చేశారు. విభజన చట్టంలో ఉన్న హామీలను త్వరితగతిన పూర్తి చేసేలా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని ఆ పిటిషన్‌లో కోరారు. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు.