: మన గ్రహాలకు జలప్రదాతలు ఉల్కలే!


భూమి మీద, చంద్రుడి మీద ఉన్న నీటి వనరులు రెండూ కూడా ఉల్కల ద్వారానే ఈ గ్రహాల మీదికి వచ్చినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. చంద్రుడిమీద కనిపించే శిలలు, భూమిమీద ఉండే హైడ్రోజన్‌ డ్యుటీరియంల నిష్పత్తి గురించి శాస్త్రవేత్తలు కొన్ని పరీక్షలు నిర్వహించారు. ఇన్నాళ్లూ చంద్రుడిపై ఉన్న నీటి వనరులు తోకచుక్కల నుంచి వచ్చినట్లుగా ఓ అభిప్రాయం వ్యాప్తిలో ఉండేది.

అయితే తాజాగా ఈ పరిశోధనల్లో 450 కోట్ల ఏళ్ల కిందట ఓ భారీ వస్తువు ఢీకొట్టడానికి ముందు నుంచే భూమిపై జలం ఉండేదని తేల్చారు. అది ఢీకొట్టిన తర్వాత కూడా నీటి అస్తిత్వం ఉంది. ఆ ఢీకొట్టిన సమయంలో భూమినుంచి వేరు పడిన ముక్కే చంద్రుడు గనుక.. అక్కడ కూడా ఈ నీటి ఉనికి అలాగే ఉండిపోయింది అని శాస్త్రవేత్తలు తేల్చారు. కనుక చందమామ పుట్టినప్పటినుంచి అక్కడ నీరున్నట్లే లెక్క అని బ్రౌన్‌ యూనివర్సిటీకి చెందిన ఆల్ బర్టో సాల్‌ నేతృత్వంలోని బృందం జరిపిన పరీక్షల్లో తేలింది.

  • Loading...

More Telugu News