: విరిగిన గుండెను అతికేశారు


'మనసు విరిగితే ఇక మందు లేదు' అనే కాన్సెప్టును మనం సినిమాల్లో డైలాగుల రూపంలో, పాటల రూపంలో కొన్ని వందల సార్లు చూసి ఉంటాం. అయితే గుండె పగిలితే మాత్రం చికిత్స ఉంది. కావాలంటే చెన్నైలోని స్టాన్లీ ప్రభుత్వాస్పత్రి డాక్టర్లను కదిపి చూడండి. 24 ఏళ్ల పెయింటర్‌ జోసెఫ్‌కు గుండె పగిలితే తాము దాన్ని ఎలా 'అతికేశామో' వారు చాలా సంబరంగా చెబుతారు.

అవును జోసెఫ్‌ అనే పెయింటర్‌.. తరచూ స్పృహ తప్పడం, రక్తం కక్కడం వంటి సమస్యలతో స్టాన్లీ ఆస్పత్రికి వచ్చాడు. పాపం కూలి చేసుకుంటే గానీ పొట్టగడవని జీవితం అతనిది. ముందు సాధారణ అల్సర్ల సమస్య అనుకున్న డాక్టర్లు పరీక్షలు ప్రారంభించేసరికి అనుమానాలు వచ్చాయి. మరింత లోతుగా యాంజియోగ్రాం సహా రకరకాల పరీక్షలు నిర్వహించారు. మొత్తానికి అతని గుండె పగిలిపోయి ఉన్నదని.. రక్తం సరఫరా సరిగా లేక, అప్పుడప్పుడూ ఆగిపోతుండడంతో సమస్య తలెత్తుతోందని గుర్తించినట్లు డాక్టర్‌ దామోదరన్‌ చెప్పారు. మొత్తానికి ఆ గుండెకు ప్యాచెస్‌ చేసేయాలని నిర్ణయించిన డాక్టర్లు, మరో నలుగురు నిపుణులు కలిసి ఆధునిక సాంకేతికతతో సుదీర్ఘమైన ఆపరేషన్‌ జరిపించి.. జోసెఫ్‌ గుండెను అతికేశారు.

  • Loading...

More Telugu News