nagasharuya: 'ఆయనకి ఇద్దరు' రీమేక్ .. హీరోగా నాగశౌర్య?
- నాగశౌర్య హీరోగా 'నర్తనశాల'
- తరువాత సినిమాగా రీమేక్
- త్వరలో సెట్స్ పైకి
తెలుగు తెరపై ఇద్దరు భార్యలమధ్య నలిగే కథానాయకుడికి సంబంధించిన కథలు .. ఇల్లాలికి ప్రియురాలికి మధ్య నలిగిపోయే హీరోకి సంబంధించిన కథలు ఒకప్పుడు విశేషమైన ఆదరణ పొందాయి. ఈ తరహా కథల్లో ఒకప్పుడు శోభన్ బాబు .. ఆ తరువాత కాలంలో జగపతిబాబు ఎక్కువగా నటించారు. అలా జగపతిబాబు నటించిన సినిమాల్లో 'ఆయనకి ఇద్దరు' ఒకటి. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో ప్రేక్షకాదరణ పొందింది.
ఆ సినిమాను ఇప్పటి ట్రెండ్ కి తగినట్టుగా స్వల్పమైన మార్పులు చేసి రీమేక్ చేయనున్నారనేది తాజా సమాచారం. రాజా దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకి వి. ఆనంద్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ సినిమాలో కథానాయకుడిగా నాగశౌర్య నటిస్తున్నాడు. కథానాయికల ఎంపికకి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోందని అంటున్నారు. ప్రస్తుతం నాగశౌర్య చేస్తోన్న 'నర్తనశాల' పూర్తికాగానే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది.