లక్డీకపూల్ సెంట్రల్ హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం!
- అకౌంట్స్ విభాగంలో మంటలు
- షార్ట్ సర్క్యూట్ తో చెలరేగిన మంటలు
- మూడు గంటలు శ్రమించిన ఫైర్ సిబ్బంది
విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన వచ్చిన మూడు ఫైరింజన్లు మంటలను అదుపు చేశాయి. ఈ ఘటనలో స్వల్ప ఆస్తి నష్టం మినహా ప్రాణనష్టమేమీ జరగలేదని అధికారులు వెల్లడించారు. మంటలను హోటల్ లోని ఇతర గదులకు వ్యాపించకుండా చర్యలు చేపట్టామని, మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశామని తెలిపారు.