: బన్సల్ రాజీనామా ధ్రువీకరించని కేంద్రం
రైల్వే మంత్రి పీకే బన్సల్ రాజీనామా వ్యవహారంపై అస్పష్టత నెలకొంది. ఆయన ఈ సాయంత్రం రాజీనామా చేశారని మీడియాలో వార్తలొచ్చినా, ఆ విషయాన్ని ప్రధాని కార్యాలయం ఇంకా ధ్రువీకరించకపోవడంతో గందరగోళం ఏర్పడింది. న్యాయశాఖ మంత్రి అశ్వినీ కుమార్ వ్యవహారంలో కూడా కాంగ్రెస్ అధిష్ఠానం ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది. ప్రధానితో ఈ సాయంత్రం నుంచి వరుసగా కీలకనేతలు భేటీ అవుతున్న సంగతి తెలిసిందే. సోనియాతో పాటు ఆజాద్, అహ్మద్ పటేల్, మనీష్ తివారీ తదితరులు ప్రధాని మన్మోహన్ తో విడతలవారీగా చర్చల్లో పాల్గొన్నారు.