Telugudesam: టీడీపీ, కాంగ్రెస్ పార్టీల ఎంపీలకు విప్ జారీ

  • అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం లోక్ సభలో చర్చ
  • ఆ రోజు హాజరు కావాలని కాంగ్రెస్ ఎంపీలకు విప్ జారీ
  • శుక్ర, సోమవారాల్లో ఉభయసభలకు రావాలని టీడీపీ ఎంపీలకు ఆదేశాలు

ఏపీ విభజన హామీలు నెరవేర్చడంలో కేంద్రం నిర్లక్ష్య వైఖరిని టీడీపీ ఎండగడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ సభ్యులు ఈ రోజు లోక్ సభలో కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. అవిశ్వాస తీర్మానానికి పలు పార్టీలకు చెందిన యాభై మందికి పైగా ఎంపీలు మద్దతు తెలిపారు. దీనిపై శుక్రవారం లోక్ సభలో చర్చ జరగనుంది.

ఈ నేపథ్యంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. ఎంపీలంతా శుక్రవారం లోక్ సభకు హాజరు కావాలని కాంగ్రెస్ పార్టీ జారీ చేసిన విప్ లో ఆదేశించింది. శుక్ర, సోమవారాల్లో ఉభయసభలకు తమ ఎంపీలందరూ హాజరు కావాలని టీడీపీ జారీ చేసిన విప్ లో ఆదేశించింది. కాగా, శుక్రవారం లోక్ సభలో ప్రశ్నోత్తరాలను రద్దు చేసి ఆరోజు ఉదయం 11 నుంచి 6 గంటల వరకు అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనుంది.  

  • Loading...

More Telugu News