: 'ప్లే ఆఫ్' కోసం బెంగళూరు ఉరకలు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నేడు ఢిల్లీ డేర్ డెవిల్స్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ లో గెలిచి ప్లే ఆఫ్ బెర్తు దిశగా మరో అడుగు ముందుకేయాలని బెంగళూరు జట్టు వ్యూహకర్తలు భావిస్తున్నారు. బెంగళూరు ఇప్పటివరకు 12 మ్యాచ్ లాడి 7 విజయాలు, 5 ఓటములతో కొనసాగుతోంది. సరిగ్గా ఇవే గణాంకాలతో ఈ జట్టుకు సన్ రైజర్స్ హైదరాబాద్ గట్టి పోటీ ఇస్తోంది. ప్లే ఆఫ్ దశకు చేరాలంటే మరో రెండు మ్యాచ్ లలో విజయం సాధించడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు కీలకం. ఈ పోరుకు ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానం వేదిక. టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ జట్టుకు వార్నర్ నాయకత్వం వహిస్తున్నాడు.