బట్టలు మార్చుకుని వస్తానని వెళ్లి, ఉరేసుకున్న 'నీట్' కోచింగ్ విద్యార్థిని... విశాఖలో ఘటన!
- నీట్ ఒత్తిడికి మరో విద్యాకుసుమం బలి
- ఇంటర్ వరకూ తెలుగు మీడియం, ఆపై ఇంగ్లీష్
- పాఠాలు అర్థం కావడం లేదని డైరీలో రాసుకున్న అమృత
పోలీసులు వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా, ఆమె ఉరేసుకుని మరణించింది. ఆమెకు హాస్టల్ నివాసం కొత్తేమీ కాదని తెలుస్తోంది. 8 నుంచి ఇంటర్ వరకూ అమృత హాస్టల్ లోనే ఉండి చదువుకుంది. తెలుగు మీడియంలో చదివిన అమ్మాయి, నీట్ కోచింగ్ ఇంగ్లీష్ మీడియంలో సాగుతుండటంతో ఒత్తిడిలో పడ్డట్టు తెలుస్తోంది. ఆమె రాసిన డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో కోచింగ్ బాగుందని, సబ్జెక్టు తనకు అర్థం కావట్లేదని, ఏడ్చేశానని రాసుకుంది. తన క్లాసులో చాలా మంది టాపర్స్ ఉన్నారని, జువాలజీ అర్థం కావట్లేదని రాసింది. కేసును విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.