: రైల్వే మంత్రి రాజీనామా
ఊహించినట్టుగానే రైల్వే మంత్రి పీకే బన్సల్ రాజీనామా చేశారు. మేనల్లుడు లంచం స్వీకరించిన వ్యవహారంలో మంత్రి పాత్ర కూడా ఉందని ఆరోపణలు వెల్లువెత్తున్న నేపథ్యంలో ఈరోజు సాయంత్రం బన్సల్ తన పదవి నుంచి వైదొలిగారు. రెండ్రోజుల అనంతరం ఈ రోజు రైల్ భవన్ కార్యాలయానికి వెళ్ళిన బన్సల్ పలు పెండింగ్ పనులను చక్కబెట్టినట్టు సమాచారం. బన్సల్ తొలగింపు విషయమై ఈ సాయంత్రం ప్రధానితో సోనియా భేటీ ముగిసిన వెంటనే బన్సల్ తన రాజీనామా లేఖను అధినేత్రికి పంపినట్టు తెలుస్తోంది. కాగా, ముడుపుల కేసులో ప్రస్తుతం మేనల్లుడు సింగ్లాను విచారిస్తోన్న సీబీఐ ఇక మేనమామ బన్సల్ నూ అరెస్టు చేయనుంది.