ds: భవిష్యత్ కార్యాచరణపై తన అనుచరులతో రహస్య భేటీ నిర్వహించిన డీఎస్!
- మళ్లీ కాంగ్రెస్ లో చేరే యోచనలో డీఎస్
- హైదరాబాద్ శివార్లలో అనుచరులతో భేటీ
- భవిష్యత్ కార్యాచరణపై చర్చ
టీఆర్ఎస్ పార్టీ నుంచి డీఎస్ ను బహిష్కరించాలంటూ ఆ పార్టీ నిజామాబాద్ ఎంపీ కవితతో పాటు జిల్లా నేతలు పార్టీ అధిష్ఠానాన్ని కోరిన సంగతి తెలిసిందే. అయితే, డీఎస్ విషయంలో కేసీఆర్ ఇంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇదే సమయంలో డీఎస్ కు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదు.
మరోవైపు, ఆయన కాంగ్రెస్ లో తిరిగి చేరబోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, తన అనుచరులతో డీఎస్ రహస్యంగా సమావేశమయ్యారు. హైదరాబాద్ నగర శివార్లలో ఈ సమావేశం జరిగినట్టు సమాచారం. తెలంగాణలో మారుతున్న రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది.