: ప్రధానితో సోనియా భేటీ ఆంతర్యం అదేనా?
ప్రధాని మన్మోహన్ సింగ్ తో యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ ఈ సాయంత్రం ఢిల్లీలో భేటీ అయ్యారు. కేంద్రానికి తలనొప్పిగా పరిణమించిన రైల్వే మంత్రి పవన్ కుమార్ బన్సల్, న్యాయశాఖ మంత్రి అశ్వినీ కుమార్ ల తొలగింపు విషయమై వీరిద్దరి మధ్య చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. సమావేశం అనంతరం మంత్రులపై వేటు విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగా, రెండ్రోజుల అనంతరం బన్సల్ తన కార్యాలయం రైల్ భవన్ కు వెళ్ళారు.