bjp: బీజేపీ నాయకులను రాష్ట్రంలో తిరగనివ్వం: ఏపీ కాంగ్రెస్ నేత నరసింహారావు

  • బీజేపీ ప్రభుత్వ విధానాలపై ఏపీ కాంగ్రెస్ నేతల మండిపాటు
  • విభజన హామీలన్నింటిని బీజేపీ ప్రభుత్వం తుంగలో తొక్కింది
  • కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం 

బీజేపీ ప్రభుత్వం ఇవే విధానాలు కొనసాగిస్తే ఆ పార్టీ నాయకులను ఏపీలో తిరగనివ్వమని ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి నరహరిశెట్టి నరసింహారావు హెచ్చరించారు. సుప్రీంకోర్టులో బీజేపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయడాన్ని ఏపీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖండించారు. విజయవాడలోని ఆంధ్రరత్నభవన్ ఏపీ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా నియోజకవర్గ సమావేశం జరిగింది. 

ఈ సందర్భంగా కేంద్రం తీరుపై  వారు నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం, నరహరిశెట్టి నరసింహారావు మాట్లాడుతూ, విభజన చట్టంలోని అంశాల అమలు, విశాఖ రైల్వేజోన్, పోలవరం ప్రాజెక్టు విధి విధానాలన్నింటినీ బీజేపీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని, చంద్రబాబు, మోదీ ఇద్దరూ దొందూ దొందేనని విమర్శించారు. అనంతరం, కాంగ్రెస్ పార్టీ నేతలు, మీసాల రాజేశ్వరరావు, వి.గురునాథం మాట్లాడారు. 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, అధికారంలోకి రాగానే ప్రత్యేకహోదా ఫైల్ పైనే సంతకం చేసి, ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడతామని అన్నారు.

  • Loading...

More Telugu News