: ఎన్నికల వేళ రక్తపాతమే: ఉరుముతున్న పాక్ తాలిబాన్లు


పాకిస్తాన్ లో రేపు జరిగే ఎన్నికల సందర్భంగా దేశవ్యాప్తంగా దాడులకు పాల్పడతామని తెహ్రీక్-ఏ-తాలిబాన్ తీవ్రవాద సంస్థ హెచ్చరిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని అంతం చేయడమే లక్ష్యంగా ఆత్మాహుతి దాడులు చేస్తామని కూడా పేర్కొంది. ఈ మేరకు పాక్ తాలిబాన్ చీఫ్ హకీముల్లా మెహ్ సూద్ తన కమాండర్లకు లేఖలు రాశారు. పాక్ లో పలు చోట్ల దాడులకు పాల్పడాలని ఆ లేఖలో వారికి సూచించారు. దేవుణ్ణి నిరాకరించే ప్రజాస్వామ్య వ్యవస్థను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని మెహ్ సూద్ ఉపదేశించారు. కాగా, గత నాలుగు వారాల్లో పాకిస్తాన్ లో 100 మందికి పైగా తాలిబాన్లు విధ్వంసకాండకు బలయ్యారు. వారిలో ఎన్నికల్లో పోటీ చేస్తోన్న పలువురు అభ్యర్థులు కూడా ఉన్నారు.

  • Loading...

More Telugu News