jc: గెలుపోటములకు అతీతంగా టీడీపీలోనే కొనసాగుతాను!: జేసీ దివాకర్‌ రెడ్డి

  • మరో ఐదేళ్లయినా టీడీపీ అధికారంలో ఉండాల్సిన అవసరం ఉంది
  • మరో రెండేళ్లలో రాయలసీమ అభివృద్ధి 
  • పెద్దలను గౌరవించడం తెలియని వ్యక్తి జగన్
  • జగన్ వెంట నడుస్తోన్న వారంతా డబ్బులిస్తే వచ్చినవారే

గెలుపోటములకు అతీతంగా టీడీపీలోనే కొనసాగుతానని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి అన్నారు. విశాఖపట్నానికి రైల్వే జోన్‌ కోరుతూ టీడీపీ నేతలు చేస్తోన్న దీక్ష కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... మరో ఐదేళ్లయినా టీడీపీ అధికారంలో ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. రెండేళ్లలో రాయలసీమ కోనసీమ కంటే ఎక్కువగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. పెద్దలను గౌరవించడం తెలియని వ్యక్తి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డని విమర్శించారు. ఆయన వెంట నడుస్తోన్న వారంతా డబ్బులిస్తే వచ్చినవారేనని అన్నారు.

కాగా, కుమారుడిని ప్రధానిని చేయాలన్న దురాలోచనతో సోనియా గాంధీ రాష్ట్రాన్ని విభజించారని, చివరకు యూపీఏ ఓడిపోయిందని జేసీ దివాకర్‌ రెడ్డి అన్నారు. బీజేపీతో కలిసి వెళ్లకూడదని తాను చంద్రబాబు నాయుడికి ముందే చెప్పానని, చివరికి నాలుగేళ్ల తరువాత విడిపోయామని అన్నారు. కేంద్ర ప్రభుత్వాల పాలన బ్రిటీష్‌ పాలన కంటే దారుణంగా ఉందని అన్నారు.  

  • Loading...

More Telugu News