: సిద్ధరామయ్యే కర్ణాటక సీఎం


కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరన్న ఉత్కంఠకు కాంగ్రెస్ అధిష్ఠానం తెరదించింది. నేడు పార్టీ పరిశీలకుడిగా బెంగళూరు వచ్చిన ఏకే ఆంటోనీ.. సిద్ధరామయ్యను కర్ణాటక సీఎంగా ప్రకటించారు. సోమవారం ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఎమ్మెల్యేల్లో అత్యధికులు సిద్ధరామయ్య అభ్యర్థిత్వానికే మొగ్గు చూపడంతో అధిష్ఠానం పని సులువైంది.

ఇంతకుముందు, ముఖ్యమంత్రి పదవికి సీనియర్ నేతలు సిద్ధరామయ్య, మల్లికార్జున ఖర్గేలు పోటీపడుతున్నట్టు ప్రచారంలో ఉన్నా.. హైకమాండ్ ఆ విషయాన్ని పార్టీ ఎమ్మెల్యేల నిర్ణయానికి వదిలివేసింది. పార్టీ ప్రతినిధులుగా బెంగళూరు విచ్చేసిన ఏకే ఆంటోనీ, అంబికా సోనీ ఎమ్మెల్యేల అభిప్రాయాలను స్వీకరించగా, 75 మంది సిద్ధరామయ్య పేరు సూచించినట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 224 స్థానాలకు గాను 121 స్థానాలను గెలుచుకున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News