Telangana: తెలుగు రాష్ట్రాల్లో ఉక్కు పరిశ్రమల ఏర్పాటుపై కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్‌ వివరణ

  • చౌదరి బీరేంద్రసింగ్‌తో టీడీపీ ఎంపీల భేటీ
  • ఉక్కు పరిశ్రమల ఏర్పాటు అధ్యాయం ముగిసిపోలేదు
  • వాటి ఏర్పాటు అంశాలపై నిన్న వెంకయ్య సమీక్షించారు
  • ఉక్కు పరిశ్రమల ఏర్పాటుకు కేంద్ర సర్కారు కట్టుబడి ఉంది

ఉక్కు శాఖ మంత్రి చౌదరి బీరేంద్రసింగ్‌తో ఈరోజు ఢిల్లీలో టీడీపీ ఎంపీలు సమావేశమై చర్చించారు. కడపతో పాటు ఖమ్మం జిల్లాలోని బయ్యారంలో ఉక్కు పరిశ్రమలు ఏర్పాటు చేయాలని వారు కోరారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం బీరేంద్రసింగ్‌ మీడియా సమావేశం నిర్వహించారు. ఉక్కు పరిశ్రమల ఏర్పాటు అధ్యాయం ముగిసిపోలేదని అన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు భూములు ఎంత మేరకు అవసరమన్నది కన్సల్టెన్సీ సంస్థ చెబుతుందని అన్నారు.

ఉక్కు పరిశ్రమల ఏర్పాటు అంశాలపై నిన్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా సమీక్షించారని బీరేంద్రసింగ్‌ అన్నారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని సుప్రీంకోర్టులో పిల్‌ వేశారని, కేంద్ర సర్కారు కూడా సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసిందని అన్నారు. ఉక్కు పరిశ్రమల ఏర్పాటుకు అవకాశాలపై టాస్క్‌ఫోర్స్‌ పనిచేస్తోందని చెప్పారు. ఉక్కు పరిశ్రమల ఏర్పాటుకు కేంద్ర సర్కారు కట్టుబడి ఉందని చెప్పారు.

  • Loading...

More Telugu News