TRS: 'టీఆర్ఎస్ను వీడనున్న డీఎస్' వార్తలపై.. ఆయన కుమారుడి స్పందన
- టీఆర్ఎస్ కార్యకర్తలు డీఎస్‌కు లేఖలు ఇచ్చారు
- తమకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం లేదని పేర్కొన్నారు
- దీన్నిబట్టే టీఆర్ఎస్ తీరును అర్థం చేసుకోవచ్చు
- ఢిల్లీలో డీఎస్ ఏ కాంగ్రెస్ నేతతో చర్చలు జరిపారు?
టీఆర్ఎస్ నేత ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) ఆ పార్టీని వీడి మళ్లీ కాంగ్రెస్‌లో చేరతారని వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై డీఎస్ కుమారుడు, బీజేపీ నేత ధర్మపురి అరవింద్ స్పందించారు. ఓ తెలుగు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... నిజామాబాద్ ఎంపీ, టీఆర్ఎస్ నాయకురాలు కవిత నాలుగేళ్లుగా ఆ జిల్లాలో కనబడట్లేదని విమర్శించారు. ఈ నాలుగేళ్లలో ఆమె జిల్లా ప్రజలకు పనికొచ్చే ఒక్క పని కూడా చేయలేదని, ఎప్పుడో ఓసారి జిల్లాకు వచ్చి వెళ్లేవారని అన్నారు.
తమకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం లేదని టీఆర్ఎస్ కార్యకర్తలు డీఎస్‌కు లేఖలు ఇచ్చారని, దీన్నిబట్టే టీఆర్ఎస్ తీరును అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ ముఖ్యనేతలతో డీఎస్ చర్చలు జరిపారని టీఆర్ఎస్ నేతలు చేస్తోన్న ఆరోపణలపై ఆయన స్పందిస్తూ తన తండ్రి ఏ కాంగ్రెస్ నేతను కలిశారో చెప్పాలని సవాల్ విసిరారు.