Chandrababu: ఏపీలో మళ్లీ టీడీపీనే రావాలని ప్రజలు కోరుకుంటున్నారు: సీఎం చంద్రబాబు
- ఇటీవల వచ్చిన సర్వేలపై వివిధ పార్టీలు ఏవేవో అంటున్నాయి!
- టీడీపీ మళ్లీ రాకపోతే రాష్ట్రం గురించి ప్రజల ఆందోళన
- వచ్చే ఎన్నికలకు పూర్తి ధీమాతో వెళ్తున్నాం
ఏపీలో మళ్లీ టీడీపీనే రావాలని ప్రజలు కోరుకుంటున్నారని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఈరోజు జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇటీవల వచ్చిన సర్వేలపై వివిధ పార్టీలు ఏవేవో అంటున్నాయని విమర్శించారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి రాకపోతే రాష్ట్రం ఏమైపోతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఏపీలో ప్రస్తుతం అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మళ్లీ కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికలకు మనం పూర్తి ధీమాతో వెళ్తున్నామని, బూత్ కమిటీలను పూర్తి స్థాయిలో సన్నద్ధం చేయాలని సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు పిలుపు నిచ్చారు.