: సంజయ్ దత్ చివరి ఆశా ఆవిరైంది


ముంబయి వరుస పేలుళ్ళ కేసులో తనకు ఐదేళ్ళ జైలుశిక్ష విధించడంపై బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ ను సుప్రీం నేడు తోసిపుచ్చింది. 1993లో ముంబయిలో పేలుళ్ళ సమయంలో ఆయుధాలు కలిగి ఉన్నాడన్న నేరంపై టాడా కోర్టు ఆరేళ్ళు జైలుశిక్ష విధించగా, ఇటీవలే ఈ ఘటనపై తుది తీర్పు వెలువరించిన అత్యున్నత న్యాయస్థానం ఆ తీర్పును ఐదేళ్ళకు తగ్గించింది. ఈ తాజా తీర్పుపై సంజయ్ దత్ రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సుప్రీం నేడు విచారణ చేపట్టింది.

పిటిషన్ కొట్టివేసిన నేపథ్యంలో సంజయ్ దత్ జైలుశిక్ష అనుభవించకతప్పదు. ఆయన మే15 లోగా కోర్టు ఎదుట లొంగిపోవాల్సి ఉంటుంది. కాగా, ఇదే కేసులో మరో ఆరుగురు పెట్టుకున్న రివ్యూ పిటిషన్ లు సైతం సుప్రీం కోర్టు తిరస్కరణకు గురయ్యాయి.

  • Loading...

More Telugu News