రూ.50,000కే ఐఫోన్ ఎక్స్ తరహా ఫోన్... భారత్ లో విడుదలకు యాపిల్ సన్నాహాలు!
- రూ.50,000 స్థాయిలో ధరను నిర్ణయించే అవకాశం
- ప్రారంభ స్థాయి ఫోన్ గా దీన్ని ప్రవేశపెట్టే ఆలోచన
- 6.1 అంగుళాల ఎల్ సీడీ డిస్ ప్లేతో ఉంటుందని ఫోర్బ్స్ కథనం
అయితే, ఇది ఐఫోన్ ఎక్స్ లో మార్పులు చేసిన వెర్షనా లేక మరేదైనా అన్నదానిపై అధికారిక సమాచారం లేదు. కాకపోతే ఐఫోన్ ఎక్స్ మాదిరిగా నాచ్ డిస్ ప్లేతో ఉంటుందని ఫోర్బ్స్ పత్రిక పేర్కొంది. చూడ్డానికి ఐఫోన్ ఎక్స్ మాదిరిగానే ఉంటుందని తన కథనంలో పేర్కొంది. ఇందులో ఫేస్ ఐడీ ఉంటుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండదు. ఓఎల్ఈడీ డిస్ ప్లే కాకుండా ఎల్ సీడీ డిస్ ప్లేతో ఉంటుంది. ఐఫోన్ ఎస్ఈ స్థానంలో ఈ ఫోన్ ను ప్రారంభ స్థాయి ఫోన్ గా యాపిల్ ప్రవేశపెట్టనుందని ఫోర్బ్స్ తెలిపింది.