తెలంగాణలో మరో రోడ్డు ప్రమాదం.. కారు-ఆటో ఢీ.. ఐదుగురి దుర్మరణం
- తెలంగాణలో రోడ్ల రక్త దాహం
- నిన్న 14 మంది.. నేడు ఐదుగురు
- కూరగాయలు అమ్ముకునేందుకు వెళ్తుండగా ప్రమాదం
కూరగాయలను విక్రయించేందుకు ఆటోలో వెళ్తన్న వారిని కారు రూపంలో వచ్చిన మృత్యువు కాటేసింది. వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఆటో నుజ్జునుజ్జు అయింది. ప్రమాదంలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. గాయపడిన ముగ్గురిని హైదరాబాద్ తరలించారు. మృతులను చెన్నారెడ్డిగూడేనికి చెందిన చీమల మమత, చీమల సుజాత, ఆంబోతు అసలీ, ఆంబోతు మారు, డ్రైవర్ వంగల శ్రీనుగా గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.