nandita sweta: హారర్ మూవీ సీక్వెల్లో నందిత శ్వేత
- గతంలో హిట్ కొట్టిన 'ప్రేమకథా చిత్రమ్'
- ఆ మూవీ సీక్వెల్ కి సన్నాహాలు
- దర్శకుడిగా హరికిషన్ పరిచయం
'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సినిమా చూసినవాళ్లు నందిత శ్వేత పేరును అంత తేలికగా మరిచిపోలేరు. ఆ సినిమాలో ప్రేతాత్మగా ఆమె నటనకు అభినందనలు దక్కాయి. అలాంటి నందిత శ్వేత అదే తరహా సినిమాలో చేయడానికి రెడీ అవుతోంది.
2013లో విడుదలైన 'ప్రేమకథా చిత్రమ్' భారీ విజయాన్ని అందుకుంది. సుధీర్ బాబు .. నందిత కాంబినేషన్లో .. జె. ప్రభాకర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సీక్వెల్ కి హరికిషన్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాలో మరో కథానాయికగా ఆయన సిద్ధి ఇద్నానిని తీసుకున్నట్టు సమాచారం. త్వరలోనే మిగతా నటీనటుల ఎంపిక ప్రక్రియను పూర్తిచేసి, సెట్స్ పైకి వెళ్లడానికి దర్శక నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు.