Telangana: తెలంగాణలో కాంగ్రెస్‌కి మరో షాక్‌.. దానం నాగేందర్‌ రాజీనామా

  • కారణాలు వివరిస్తూ ఏఐసీసీ అధ్యక్షుడికి లేఖ
  • రేపు మీడియా ముందు వివరాలు వెల్లడిస్తానన్న దానం
  • హైదరాబాద్ నగరంలో కీలక నేత 

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి మరో దెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్ రాజీనామా చేస్తూ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి లేఖ రాశారు. అలాగే, ఏపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి కూడా ఆయన రాజీనామా లేఖ పంపినట్లు తెలుస్తోంది. తన రాజీనామాకు కారణాలను లేఖలో విశ్లేషించారు.

కాగా, రేపు తాను మీడియా ముందుకు వస్తానని దానం నాగేందర్‌ అన్నారు. తన రాజీనామాకు గల కారణాలు, తన భవిష్యత్‌ కార్యాచరణను ఆయన రేపు ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్ నగరంలో కీలక నేతగా ఉన్న దానం నాగేందర్‌.. 1994, 1999, 2004లో ఆసిఫ్‌నగర్ శాసనసభ నుంచి పోటీ చేసి గెలిచారు. 2009 ఎన్నికల్లో ఖైరతాబాద్ శాసనసభ నుంచి గెలిచారు.      

  • Loading...

More Telugu News