ఉద్యోగినితో అక్రమ సంబంధం.. ఉద్యోగం కోల్పోయిన ఇంటెల్ సీఈవో!
- ఉద్యోగానికి రాజీనామా చేసిన బ్రియాన్ జానిచ్
- 1982లో ఇంటెల్ లో చేరి, సీఈవో వరకు ఎదిగిన బ్రియాన్
- ఉద్యోగినితో సంబంధం కారణంగా అవమానభారంతో వైదొలగిన సీఈవో
1982లో ఇంటెల్ లో ఇంజినీర్ గా చేరిన జానిచ్... అంచలంచెలుగా ఎదిగి 2013లో సీఈవోగా బాధ్యతలను స్వీకరించారు. అంతకు ముందు సీఎఫ్ఓగా కూడా పని చేశారు. అయితే, సహ ఉద్యోగినితో సంబంధం పెట్టుకోవడంతో... అవమానభారంతో కంపెనీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. మరోవైపు, ఎంతో సమర్థత కలిగిన జానిచ్ రాజీనామాతో ఇంటెల్ లో నాయకత్వ సంక్షోభం ఏర్పడిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.