హైదరాబాద్ లో దారుణం... తొలిరోజు బడికి వెళుతున్న చిన్నారిని చిదిమేసిన కారు!
- సైదాబాద్ పరిధిలో ఘటన
- నర్సరీలో రెహ్మాన్ ను చేర్పించిన తల్లిదండ్రులు
- కన్నతల్లి ముందే బలంగా ఢీకొట్టిన కారు
పండగ తరువాత తన కుమారుడిని తొలిసారిగా ముబీన్ బేగం బడికి తీసుకు వెళ్లింది. ఇంటి నుంచి ఆటోలో బడివద్దకు వెళ్లి, పాఠశాలలోకి వెళుతుండగా, మాతృశ్రీ కాలనీ నుంచి వేగంగా వచ్చిన కారు రెహ్మాన్ ను బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ముందు చక్రాల కింద నలిగిపోయిన రెహ్మాన్, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న బిడ్డ దూరం కావడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.