పీసీసీ అధ్యక్ష పదవిని సంపత్ కోరడంలో తప్పులేదు: మల్లు రవి
- ఎవరికైనా పీసీసీ అధ్యక్షుడు కావాలనే కోరిక ఉంటుంది
- రాహుల్ ను పీఎంగా చూడాలనేది యువత భావన
- రాహుల్ పుట్టిన రోజు వేడుకల్లో రవి స్పందన
ఈ నేపథ్యంలో మల్లు రవి మాట్లాడుతూ, సంపత్ వ్యాఖ్యలను బట్టి 2019 వరకు టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనసాగుతారని అర్థం చేసుకోవచ్చని చెప్పారు. హైదరాబాద్ లోని గాంధీభవన్ లో రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లు రవి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలోని యువత రాహుల్ ను ప్రధానమంత్రిగా చూడాలని భావిస్తోందని చెప్పారు.