కాంగ్రెస్ ఖేల్ ఖతం.. ప్రణబ్ ముఖర్జీ కూడా ఆరెస్సెస్ కార్యాలయానికి వెళ్లారు: ఒవైసీ
- కాంగ్రెస్ తో ప్రణబ్ ది 50 ఏళ్ల అనుబంధం
- కాంగ్రెస్ పై ఎవరైనా నమ్మకం పెట్టుకుంటారా?
- సెక్యులరిజాన్ని మోదీ, బీజేపీలు నాశనం చేస్తున్నాయి
భారత్ అంటే హిందువులు, ముస్లింలు, సిక్కులు తదితర మతాల, కులాల, ప్రాంతాల, భాషల సమాహారమని... అదే అసలైన జాతీయవాదమని ఆరెస్సెస్ కార్యాలయంలో ప్రసంగిస్తూ ప్రణబ్ చెప్పారు. ఒకే దేశం, ఒకే మతం, ఒకే ప్రాంతం వంటి భావన మనకు వర్తించదని అన్నారు. అయితే ఆరెస్సెస్ కార్యాలయానికి ప్రణబ్ వెళ్లడం పట్ల కొందరు కాంగ్రెస్ సీనియర్లు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, ఆ తర్వాత వెనక్కి తగ్గారు.