: మెడిసిన్ మేనేజ్ మెంట్ సీట్ల భర్తీ ఆన్ లైన్లోనే: మంత్రి
వైద్య కోర్సులలో మేనేజ్ మెంట్ కోటా సీట్లను ఆన్ లైన్లో భర్తీ చేస్తామని వైద్యవిద్యా మంత్రి కొండ్రు మురళి చెప్పారు. ఈ ఏడాది రాష్ట్రానికి అదనంగా 1000 మెడికల్ సీట్లు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ రోజు మధ్యాహ్నం జరగనున్న ఎంసెట్ మెడిసిన్ ప్రశ్నాపత్రం కోడ్ ను మంత్రి హైదరాబాద్ లో విడుదల చేశారు.