మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి నాగ్‌పూర్‌లో ఆర్ఎస్ఎస్ ఘన స్వాగతం
- రేపు ఆర్ఎస్ఎస్ కార్యక్రమం
- ప్రసంగించనున్న ప్రణబ్
- ఏం మాట్లాడతారన్న ఆసక్తి
విమానాశ్రయంలో ఆర్ఎస్ఎస్ నాయకులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పలికారు. కాగా, రేపు జరగనున్న ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో ప్రణబ్ ఏం మాట్లాడతారన్న ఆసక్తి నెలకొంది. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ఈ విషయంపై స్పందిస్తూ ఆర్ఎస్ఎస్ భావజాలంలో లోపం ఎక్కడుందో చెప్పండంటూ వ్యాఖ్యానించారు. కాగా, తాను ఏం మాట్లాడతానో నాగ్‌పూర్‌లోనే చూడండని ప్రణబ్ ఇటీవల మీడియాకు చెప్పారు.