: కుబేరుల ముంబై
వేల కోట్ల రూపాయల కుబేర పుత్రులు ముంబైలో అధికంగా ఉన్నారట. ప్రపంచంలో ఎక్కువ మంది బిలియనీర్లు(కనీసం 4,500 కోట్ల రూపాయల సంపద) ఉన్న నగరాలలో ముంబై స్థానం 6. ఇక్కడ 26 మంది బిలియనీర్లున్నారని వెల్త్ఇన్ సైట్ అనే పరిశోధనా సంస్థ తెలిపింది. చైనాలోని ప్రముఖ నగరం షాంఘై, ఫ్రాన్స్ రాజధాని పారిస్, అమెరికాలోని లాస్ ఏంజెలెస్ నగరాలు కూడా బిలియనీర్ల విషయంలో ముంబై కంటే వెనుకనే ఉన్నాయి. 70 మంది కుబేరులతో న్యూయార్క్ నగరం టాప్ ప్లేస్ లో ఉంది. మాస్కో(64), లండన్(54), హాంగ్ కాంగ్(40), బీజింగ్(29) తొలి ఐదు స్థానాలలో ఉన్నాయి.