: ఎంసెట్ పరీక్షలు ప్రారంభం.. 12న ప్రాథమిక కీ


రాష్ట్రవ్యాప్తంగా 534 కేంద్రాలలో ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్ష ప్రారంభమైంది. అన్నట్లుగానే నిమిషం ఆలస్యంగా వచ్చిన వారిని అధికారులు లోపలకు అనుమతించలేదు. దీంతో పలు కేంద్రాలలో కొంత మంది బయటే ఉండిపోయారు. మధ్యాహ్నం 2.30 గంటలకు మెడిసిన్ అభ్యర్థులకు పరీక్ష మొదలవుతుంది.

ఈ నెల 12న ప్రాథమిక కీ విడుదల చేస్తామని ఎంసెట్ కన్వీనర్ రమణారావు వెల్లడించారు. 18న తుది కీ, జూన్ 2న ఇంజనీరింగ్ అభ్యర్థులకు సంబంధించిన ఫలితాలు విడుదల చేస్తామని చెప్పారు. కోర్టు తీర్పును బట్టి మెడిసిన్ అభ్యర్థుల ఫలితాలను విడుదల చేస్తామన్నారు.

  • Loading...

More Telugu News