: ఈ మాస్కు ఉంటే.. మీ చూపు, వినికిడి పెరుగుతాయి
చూపు పెరగడం అంటే మామూలుగా పెరగడం కాదు.. ఏకంగా లాంగ్ ఎక్స్‌పోజర్ ఫోటోగ్రఫీ తరహాలో.. మీరు చూస్తున్న దృశ్యం కనిపించాలంటే మాత్రం.. మీరు ఈ ప్రత్యేకమైన మాస్కును ధరించాల్సిందే. లండన్లోని రాయల్ కాలేజీ ఆఫ్ ఆర్ట్స్‌కు చెందిన విద్యార్థులు రూపొందించిన ఈ మాస్కులు కేవలం చూపును మెరుగుపరచడమే కాదు... ఎంత గందరగోళ చప్పుళ్ల మధ్య ఉన్నా.. మనం తలచుకున్న నిర్దిష్ట శబ్దాన్ని స్పష్టంగా వినిపించగలవు కూడా.
ఈ త్రీడీ ప్రింటెడ్ మాస్కులను ధరిస్తే.. అవి చెవులకు ఉండే చోట ఓ మైక్రోఫోన్ ఉంటుంది. దాని ద్వారా నిర్దిష్ట శబ్దాల్ని వినొచ్చు. కళ్లస్థానంలో ఆ మాస్కులోనే ఓ బుల్లి కెమెరా ఉంటుంది. అది దృశ్యాల్ని చిత్రీకరించి.. కంప్యూటర్‌కు పంపుతుంది. ఆ కంప్యూటరు అక్కడ దృశ్యాలకు కొన్ని ఎఫెక్ట్స్ జోడించి .. మళ్లీ వెనక్కు పంపుతుంది. దాంతో వ్యక్తి ధరించిన మాస్కులోంచి ఆ దృశ్యాలు .. లాంగ్ ఎక్స్‌పోజర్ ఫోటోగ్రఫీలాగా కనిపిస్తాయన్నమాట.