Chandrababu: నా క్యారెక్టర్‌ను వేలెత్తి చూపించే దమ్ము ఎవరికైనా ఉందా?: చంద్రబాబు

  • మహానాడులో చంద్రబాబు ముగింపు ఉపన్యాసం
  • క్రమశిక్షణతో ఉంటున్నాను
  • భావి తరాలకు ఆదర్శంగా ఉండాలనుకున్నాను
  • చిన్న తప్పు కూడా జరగకూడదని ముందుకు వెళుతున్నాను

తన క్యారెక్టర్‌ను వేలెత్తి చూపించే దమ్ము ఎవరికైనా ఉందా? అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. విజయవాడలో జరుగుతోన్న మహానాడులో ఆయన ముగింపు ఉపన్యాసం ఇచ్చారు. తాను 40 ఏళ్ల నుంచి ఎంతో క్రమశిక్షణతో, విశ్వసనీయతతో ఉన్నానని అన్నారు. భావి తరాలకు ఆదర్శంగా ఉండాలని, ఎక్కడా చిన్న తప్పు జరగకూడదని భావిస్తూ ముందుకు వెళుతున్నానని చెప్పారు. 40 ఏళ్లుగా తనపై చాలామంది ఎన్నో ఆరోపణలు చేశారని, ఒక్క ఆరోపణని కూడా నిరూపించలేకపోయారని అన్నారు. తాను నమ్ముకున్న సిద్ధాంతాలు, శ్రమ వల్లే ఈ స్థాయికి వచ్చానని అన్నారు.  

కాగా, తాము అధికారం కోసం కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేశామని చంద్రబాబు అన్నారు. తాము పదవుల కోసం ఎన్డీఏలో చేరలేదని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే చేరామని, కానీ కేంద్ర సర్కారు మాట నిలబెట్టుకోలేదని చెప్పారు. అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్లి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిద్దామన్నారు. 

  • Loading...

More Telugu News