రాజకీయాల్లో అత్యంత నీచుడు మోత్కుపల్లి: సండ్ర వెంకటవీరయ్య
- గవర్నర్ పదవి ఇవ్వకపోవడం వల్లే చంద్రబాబుపై విషం చిమ్ముతున్నారు
- పార్టీలో ఉంటూనే కేసీఆర్, పవన్, జగన్ ని పొగుడుతున్నాడు
- టీడీపీ కార్యకర్తలెవ్వరూ అతన్ని దగ్గరికి రానీయకూడదన్న సండ్ర
అప్పట్లో తెలంగాణ సీఎం కేసీఆర్ ని విమర్శించిన మోత్కుపల్లికి ఇప్పుడాయన దేవుడయ్యాడా?.. పార్టీలో ఉంటూనే కేసీఆర్, పవన్ కల్యాణ్, వైయస్ జగన్ ని పొగుడుతారా? నీ వెనుక ఎవరున్నారో మాకు తెలుసని సండ్ర మండిపడ్డారు. మోత్కుపల్లి లాంటి దుర్మార్గున్ని టీడీపీ కార్యకర్తలెవ్వరూ దగ్గరికి రానీయకూడదని, మనిషిగా ఎప్పుడో ఆయన చచ్చిపోయాడని ఈ సందర్భంగా సండ్ర అన్నారు.