వైసీపీ-జనసేన పార్టీలు చీకటి ఒప్పందం చేసుకున్నాయి!: అశోక్ గజపతిరాజు ఆరోపణ
- వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్టే
- ‘కాంగ్రెస్’కు పట్టిన గతే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి పడుతుంది
- ఆ మూడేళ్లు బొత్స ఎక్కడ?
గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి పడుతుందని అన్నారు. వైసీపీ-జనసేన పార్టీలు చీకటి ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు. ఈ సందర్భంగా వైసీపీ నేత బొత్స సత్యనారాయణపైనా ఆయన విమర్శలు చేశారు. అధికారంపోయిన తర్వాత మూడేళ్లు ఎక్కడున్నారో తెలియని బొత్స, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికారం కోసం మళ్లీ బయటకు వస్తున్నారని అన్నారు.