Hyderabad: నాకు ప్రధాని పదవి అవసరం లేదు: సీఎం చంద్రబాబు
- తెలుగుజాతే నాకు ముఖ్యం
- 2019 ఎన్నికల తర్వాత దేశ రాజకీయాల్లో మార్పు వస్తుంది
- జాతీయస్థాయి రాజకీయాల్లో టీడీపీ కీలకపాత్ర పోషిస్తుంది
- ఏపీకి న్యాయం జరిగే వరకు ధర్మపోరాట దీక్ష ఆగదు
తనకు ప్రధాన మంత్రి పదవి ముఖ్యం కాదని, తెలుగజాతే ముఖ్యమని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మరోసారి స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో మహానాడు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ, 2019లో జాతీయస్థాయి రాజకీయాల్లో టీడీపీ కీలకపాత్ర పోషిస్తుందని, ఈ ఎన్నికల తర్వాత దేశ రాజకీయాల్లో మార్పు వస్తుందని చెప్పారు.
ఏపీకి న్యాయం జరిగే వరకు తాను తలపెట్టిన ధర్మపోరాట దీక్ష ఆగదని, తెలుగు జాతికి న్యాయం జరగాలన్న ఉద్దేశంతోనే నిన్న కర్ణాటక వెళ్లానని చెప్పారు. ఏపీకి న్యాయం కోసం అందరినీ కూడగట్టి ధర్మపోరాటం చేస్తానని చెప్పారు. వైసీపీతో బీజేపీ చేతులు కలుపుతోందని విమర్శించారు. కాగా, ఈ సందర్భంగా మహానాడులో 8 తీర్మానాలను ఆమోదించారు.