నేడు హైదరాబాద్‌కు చేరుకోనున్న జేడీఎస్ ఎమ్మెల్యేలు.. ‘సురక్షిత’ ప్రాంతాలకు శాసనసభ్యుల తరలింపు!
- యడ్డీ ప్రమాణ స్వీకారానికి ముందే సరిహద్దులు దాటనున్న ఎమ్మెల్యేలు
- రాష్ట్రంలోనే ఉంటే దాడులు చేయించి బయటకు తీసుకు వస్తారని అనుమానం
- మరి కాసేపట్లో హైదరాబాద్‌కు జేడీఎస్ ఎమ్మెల్యేలు?
కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఇప్పటికే బెంగళూరు శివారులో ఉన్న ఈగిల్టన్ రిసార్ట్‌కు పంపగా, జేడీఎస్ ఎమ్మెల్యేలు నగరంలోని షంగ్రిల్లా హోటల్లో ఉన్నారు. అయితే, జేడీఎస్ ఎమ్మెల్యేలను హైదాబాద్‌కు పంపనున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. రాష్ట్రంలో ఉంచితే పోలీసుల ద్వారా దాడులు చేయించి వారిని విడిపిస్తారన్న అనుమానంతో సరిహద్దులు దాటించేందుకు ప్లాన్ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే మరి కాసేపట్లో జేడీఎస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లో ల్యాండవనున్నారు.