Jagan: దాదాపు 40 మంది చనిపోయారు.. ఇవి సర్కారు హత్యలే!: లాంచీ మునకపై జగన్‌

  • చంద్రబాబు బయటకు వస్తారు
  • మొసలి కన్నీరు కాల్చుతారు
  • ఇటువంటి ఘటనలు మరోసారి జరిగితే బాగోదు అంటారు
  • అధికారులను తిట్టినట్లు మీడియాలో చూపించుకుంటారు

గోదావరి నదిలో మునిగిపోయిన లాంచీ ఘటనపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి మండిపడుతూ పలు ఆరోపణలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... "ఇది చాలా బాధ కలిగించిన ఘటన. దాదాపు 40 మంది మృతి చెందారు. వీటిని సర్కారు హత్యలుగానే పరిగణించాలి. గతేడాది నవంబరులో కృష్ణా జిల్లాలో చంద్రబాబు ఇంటికి కొద్ది దూరంలోనే ఓ బోటు మునిగింది. అప్పట్లో 20 మందికి పైగా చనిపోయారు. ఇప్పటికీ ప్రభుత్వం మేల్కోలేదు.
 
లైసెన్సులు లేకుండా బోట్లను తిప్పుతున్నారు. వారు లంచాలు ఇస్తున్నారు... అందుకే ముఖ్యమంత్రి ఇటువంటి ఘటనలపై స్పందించరు. ఐదు రోజుల కిందటే ఓ బోటులో అగ్ని ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు ఎవ్వరూ చనిపోలేదు. అది జరిగిన ఐదురోజులకే మళ్లీ మరో బోటు నీళ్లలో మునిగిపోయింది. దాదాపు 40 మంది చనిపోయారు. మంత్రుల దగ్గరనుంచి చంద్రబాబు వరకు లంచాలు అందుతున్నాయి.

చంద్రబాబు బయటకు వచ్చి మొసలి కన్నీరు కార్చుతారు. ఇటువంటి ఘటనలు మరోసారి జరిగితే బాగోదు అంటూ అధికారులను తిట్టినట్లు ఎల్లో మీడియాలో చూపించుకుంటారు. గతంలో పుష్కరాల్లో కూడా 20 మందికి పైగా చనిపోయారు. కేవలంం 100 బోట్లను కూడా కంట్రోల్‌ చేయలేకపోతోంది ప్రభుత్వం. చంద్రబాబు మీద హత్య కేసులు నమోదు చేయాలి" అన్నారు జగన్ ఆవేశంగా.

  • Loading...

More Telugu News