: 'రాయల్' గా గెలిచారు


కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం స్వంతం చేసుకుంది. మొహాలీలో ఈ సాయంత్రం జరిగిన పోరులో రాజస్థాన్ 8 వికెట్లతో విజయదుందుభి మోగించింది. రహానే (59 నాటౌట్)కు తోడు సంజూ శాంసన్ (47 నాటౌట్) అమోఘమైన ఆటతీరు కనబర్చడంతో మరో 6 బంతులు మిగిలుండగానే రాజస్థాన్ విజయతీరాలకు చేరింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 6 వికెట్లకు 145 పరుగులు నమోదు సంగతి తెలిసిందే. కాగా, తాజా విజయంతో పాయింట్ల పట్టికలో రెండోస్థానానికి ఎగబాకిన రాజస్థాన్ మరో విక్టరీ సాధిస్తే ప్లే ఆఫ్ దశకు అర్హత పొందుతుంది.

  • Loading...

More Telugu News