Tollywood: ఈ నెల 18న ఆర్.నారాయణమూర్తి ‘అన్నదాతా సుఖీభవ’ విడుదల

  • రైతు బాధలు కథాంశంగా రూపొందించిన అన్నదాతా సుఖీభవ
  • పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు పూర్తి .. ఆడియో విడుదల
  • ఈ నెల 18న  విడుదల 

స్నేహ చిత్ర బ్యానర్ పై ప్రముఖ నటుడు దర్శకుడు ఆర్.నారాయణమూర్తి రూపొందిస్తున్న చిత్రం 'అన్నదాతా సుఖీభవ'. నారాయణమూర్తి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 18న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. రైతు బాధలను కథాంశంగా తీసుకుని రూపొందించిన ఈ చిత్రం ఆడియో నిన్న విడుదలైంది. ఈ కార్యక్రమంలో యలమంచిలి శివాజీ, ప్రముఖ పాటల రచయితలు సుద్దాల అశోక్ తేజ, గోరెటి వెంకన్న, గాయకుడు వందేమాతరం శ్రీనివాస్, నటుడు, రచయిత వైఎస్ కృష్ణేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News