జేడీఎస్ తో పొత్తా?.. అలాంటిదేం ఉండదు: బీజేపీ నేత సదానందగౌడ
- ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ ను దాటాం
- స్పష్టమైన మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం
- ఏ పార్టీతో కలవాల్సిన అవసరం లేదు
బీజేపీ నేత సదానంద గౌడ మాట్లాడుతూ, తమకు ఎవరితోనూ కలవాల్సిన అవసరం లేదని, తామే స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ ను క్రాస్ అయ్యామని తెలిపారు. ఇతర పార్టీల మద్దతు లేకుండానే తాము అధికారాన్ని చేపట్టబోతున్నామని ఇంతకు ముందే బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కూడా చెప్పారు.