ఫ్యాక్షన్ హత్యతో ఉలిక్కిపడ్డ కర్నూలు... మాజీ ఎంపీ మనవడిని రాళ్లతో కొట్టి చంపిన దుండగులు
- మాజీ ఎంపీ ముద్దూరు సుబ్బారెడ్డి మనవడి హత్య
- మారణాయుధాలు వాడని దుండగులు
- డోన్ లో ఘటన - పోలీసుల కేసు నమోదు
శ్రీకాంత్ రెడ్డి హత్య గురించి తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని, హత్యకు మారణాయుధాలు వాడకుండా, రాళ్లతో కొట్టి చంపినట్టు తెలుస్తోందని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామని వెల్లడించారు. ఈ ప్రాంతంలో పికెటింగ్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు.