Andhra Pradesh: ఏపీ రైతులను ఆదుకోవాలి ..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం స్పందించాలి : వైఎస్ జగన్

  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం స్పందించాలి
  • నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
  • తగిన నష్టపరిహారం చెల్లించాలి
  • కేంద్రం ప్రత్యేక నిధులు విడుదల చేయాలి

ఏపీలో అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని వైసీపీ అధినేత జగన్ కోరారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. అకాలవర్షాల కారణంగా రైతులు నష్టపోవడం చాలా బాధాకరమని, తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తక్షణం చేపట్టాలని, బాధిత రైతులకు నష్టపరిహారమివ్వాలని డిమాండ్ చేశారు. మరో ట్వీట్ లో..  నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు సరిపడా నష్టపరిహారం చెల్లించేందుకు కేంద్రం ప్రత్యేక నిధులు విడుదల చేయాలని కోరారు. దెబ్బతిన్న ప్రాంతాల్లో రైతులను ఆదుకునేందుకు వైసీపీ కేడర్ సాయపడాలని జగన్ సూచించారు.

  • Loading...

More Telugu News