: సుప్రీం చెప్పింది నిజమేనంటోన్న సీబీఐ చీఫ్
అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పేర్కొన్నట్టు సీబీఐ పంజరంలో చిలుకలా తయారైందని సీబీఐ చీఫ్ రంజిత్ సిన్హా అంగీకరించారు. నేడు ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన ఆయన సుప్రీంకోర్టు ఏదైతే వ్యాఖ్యానించిందో అది వాస్తవం అని చెప్పారు. బొగ్గు కుంభకోణం దర్యాప్తులో సీబీఐ కేంద్రం చెప్పినట్టే నడుచుకుంటోందని నిన్న సుప్రీం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కాగా, ఈ విషయమై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ స్పందిస్తూ, సీబీఐ వ్యవహారంలో సుప్రీం చేసింది వ్యాఖ్య మాత్రమేనని, అదేమీ ఆదేశం కాదని అన్నారు. ఇందులో ప్రభుత్వం తప్పేమీ లేదని ఆయన చెప్పారు.