Gali Muddu Krishnama Naidu: గాలి సరస్వతమ్మకు టికెట్ ఖారారు చేసిన చంద్రబాబు

  • చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి టికెట్ ఖరారు
  • గాలి సతీమణి సరస్వతమ్మకు టికెట్
  • టికెట్ కోసం పోటీ పడ్డ గాలి కుమారులు

గాలి ముద్దుకృష్ణమనాయుడు మరణంతో ఖాళీ అయిన చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ముఖ్యమంత్రి చంద్రబాబు టికెట్ ఖరారు చేశారు. గాలి సతీమణి గాలి సరస్వతమ్మకు టికెట్ ఖరారైంది. ఈ ఉదయం చంద్రబాబును సరస్వతమ్మ, ఇతర కుటుంబసభ్యులు కలుసుకున్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఎమ్మెల్సీ టికెట్ ను సరస్వతమ్మకు కేటాయించినట్టు వారికి చెప్పారు. వాస్తవానికి ఈ టికెట్ కోసం గాలి కుమారులు ఇద్దరూ పోటీ పడ్డారు. దీంతో, మధ్యే మార్గంగా సరస్వతమ్మకు టికెట్ కేటాయించారు చంద్రబాబు. సరస్వతమ్మకు టికెట్ కేటాయింపుపై గాలి కుటుంబంలో కూడా ఏకాభిప్రాయం ఉంటుందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి.

  • Error fetching data: Network response was not ok

More Telugu News