Tollywood: తెలుగు సినీ పరిశ్రమలో లైట్ మెన్ వివాదం ... జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు!

  • వేరే రాష్ట్రాల నుంచి లైట్ మెన్లను తీసుకొచ్చిన నిర్మాత  దానయ్య
  • సినీ, టీవీ అవుట్ డోర్ లైట్ మెన్ యూనియన్ నిరసన
  • తెలుగు ఫిల్మ్ ఛాంబర్ వద్ద యూనియన్ ఆందోళన

తెలుగు చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ వివాదం పెను దుమారం రేపిన విషయం తెలిసిందే. తాజాగా, మరో వివాదం తెరపైకి వచ్చింది. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఇతర రాష్ట్రాల నుంచి లైట్ మెన్లను తీసుకురావడంతో ఈ వివాదం మొదలైంది. ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన లైట్ మెన్ ను సినీ, టీవీ అవుట్ డోర్ లైట్ మెన్ యూనియన్ నాయకులు ఈరోజు అడ్డుకున్నారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో బాధితులు ఫిర్యాదు చేశారు.

 కాగా, హైదరాబాద్ లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ వద్ద ఆ యూనియన్ సభ్యులు, నాయకులు ఆందోళనకు దిగారు. మూడేళ్లకోసారి తమకు కనీస వేతనాలు ఇవ్వకుండా నిబంధనను పట్టించుకోకపోగా,తమతో ఎక్కువ సేపు పని చేయించుకుంటున్నారని యూనియన్ సభ్యులు ఆరోపించారు. కనీస వేతనాల పెంపుపై రేపటి లోగా ఓ ప్రకటన చేయకుంటే నిరవధిక ఆందోళనకు దిగుతామని, ఈ విషయమై టాలీవుడ్ పెద్దలు కల్పించుకుని తమకు న్యాయం చేయాలని కోరారు.

  • Loading...

More Telugu News