: చికిత్స కోసం ఢిల్లీలో ఉంటే, నాపై ఆరోపణలా?: చంద్రబాబు


జగన్ కు బెయిల్ లభించకపోవడం వెనుక తన హస్తం ఉందని వైఎస్సార్సీపీ నేత జూపూడి వ్యాఖ్యానించడంపై చంద్రబాబు స్పందించారు. కాలునొప్పి చికిత్స కోసం తాను ఢిల్లీలో ఉంటే జగన్ కు బెయిల్ దక్కనీయకుండా కుట్రకు పాల్పడ్డానని ఆరోపించడాన్ని బాబు ఖండించారు. కాలుకు ఫిజియోథెరపీ అవసరమని వైద్యులు సూచించన పిమ్మటే తాను ఢిల్లీలో మకాం వేశానని బాబు వివరణ ఇచ్చారు. తీవ్ర ఆర్ధిక నేరాలకు పాల్పడ్డందునే జగన్ కు బెయిల్ దక్కలేదని బాబు అన్నారు. నేడు హైదరాబాద్ లో తన నివాసంలో బాబు మీడియాతో మాట్లాడారు. కుంభకోణాలపై ప్రభుత్వాలు పట్టించుకోకున్నా, న్యాయస్థానాలు మాత్రం తమ పని తాము చేసుకుపోతున్నాయని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News