: మూడు నెలల్లో విద్యుత్ సమస్యకు పరిష్కారం: సీఎం


విద్యుత్ కొరతను తీర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. గుంటూరులో రైతు సదస్సును ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. రెండు, మూడు నెలల్లో విద్యుత్ సమస్యను పూర్తిగా అధిగమిస్తామని అన్నారు. రైతులకు రాయితీపై యంత్ర పరికరాలు అందిస్తామన్నారు. 25 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని నిల్వ చేసేందుకు అవసరమైన గోదాముల నిర్మాణాన్ని చేపట్టామని వెల్లడించారు. పంట నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ అధికంగా చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

  • Loading...

More Telugu News