: 900కు చేరిన మృతుల సంఖ్య
బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సమీపంలో బహుళ అంతస్తుల భవనం కూలిన ప్రమాదం ప్రపంచంలోనే విషాదకర ఘటనగా మారింది. ప్రమాదం జరిగి రెండు వారాలు గడచినా మృత దేహాలు పదుల సంఖ్యలో ఇంకా బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకూ వెలికితీసిన వాటి సంఖ్య 900కు చేరిందని బంగ్లా అధికారులు గురువారం ప్రకటించారు. ఇంకా సహాయక కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎనిమిది అంతస్తుల భవనంలో నాలుగు వస్త్ర తయారీ పరిశ్రమలు నడుస్తుండేవి. అందులో భారీ సంఖ్యలో కార్మికులు పనిచేస్తుండేవారు. ఒక్కసారిగా కుప్పకూలడం వల్లే మృతుల సంఖ్య భారీగా ఉంది.